- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahul Gandhi Bharat Jodo Yatra :దేశాన్ని అఖండంగా నిలిపేందుకు రాహుల్ యాత్ర
దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో ఇంత పెద్ద పాదయాత్ర చేపట్టి రాహుల్ గాంధీ తన సత్తా చాటారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ 4 వేల పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంగా గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ గాంధీ నేడు కశ్మీర్‌లో జెండా ఎగురవేస్తారని చెప్పారు. దేశాన్ని అఖండంగా నిలిపేందుకు రాహుల్ గాంధీ ధైర్య సాహసాలతో గొప్ప కార్యక్రమం పూర్తి చేశారని అంజన్ కుమార్ యాదవ్ కొనియాడారు. భారత్ జోడో యాత్ర హైదరాబాద్‌లో చార్మినార్ నుంచి చారిత్రక యాత్ర జరిగిందన్నారు. రాజీవ్ గాంధీ యాత్ర చేపట్టిన తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర ఎంతో అద్భుతమైన యాత్ర అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్య్రం కోసం, దేశాన్ని ఐక్యంగా నిలిపేందుకు గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. భారత్ జోడో కొనసాగింపుగా హాథ్ సే హాథ్ జోడో యాత్ర కొనసాగుతుందన్నారు. ప్రతి పౌరుడు ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ముందుకు రావాలని అంజన్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.