- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోహిత్ రెడ్డిపై రఘునందన్ ఫైర్
దిశ, వెబ్ డెస్క్: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై రఘునందర్ రావు తిప్పికొట్టారు. విలేకరి వృత్తి నుంచి వచ్చిన రఘునందర్ రావు రూ.10 కోట్ల విల్లాలో ఎలా నివసిస్తున్నారో చెప్పాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదివారం ప్రశ్నించారు. రూ. వందల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై స్పందించిన రఘునందన్ రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అయ్యప్ప మాలలో ఉండి రోహిత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని రోహిత్ రెడ్డి ఎందుకు ప్రమాణం చేయలేదన్నారు. 2018 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి దొరలు తిరిగే కారు కావాలా, అన్నం పెట్టే చేయి కావాలా అని రోహిత్ రెడ్డి ప్రచారం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే దొరల కాంపౌండ్‌లోకి వెళ్లాడని రోహిత్ రెడ్డిపై మండి పడ్డారు. తెలంగాణ ఉద్యమానికి రోహిత్ రెడ్డికి ఏ మాత్రం సంబంధం లేదన్నారు. రిసార్ట్‌ను అక్రమంగా కట్టిందెవని ప్రశ్నించారు. తాను అక్రమాలకు పాల్పడి ఉంటే విచారణ ఎందుకు చేయించడం లేదన్నారు. తాను డబ్బులు తీసుకున్నానని ఆరోపిస్తున్న వ్యక్తులు నిరూపించాలని సూచించారు. సర్ఫన్ పల్లి ప్రాజెక్ట్ భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. తన ఆస్తులపై విచారణకు సిద్ధమని సీఎం కేసీఆర్ ఆస్తులపై విచారణకు సిద్ధమా అని రోహిత్ రెడ్డికి సవాల్ విసిరారు.