కాటారంలో పర్యటించిన పుట్ట మధు

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-01 16:04:23.0  )
కాటారంలో పర్యటించిన పుట్ట మధు
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో గురువారం బీఆర్‌ఎస్ మంథని నియోజకవర్గం ఇంచార్జ్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్‌లు పర్యటించారు. మండలంలోని దామరకుంట గ్రామంలో రైస్ మిల్‌ను ప్రారంభించారు. మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు రాజబాబు తండ్రి జగ్గయ్య మరణించగా అతని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. దామెరకుంట గ్రామంలో జిల్లెల బాలయ్య, విలసాగర్ గ్రామంలో విరబోయిన లక్ష్మీ, చిదినేపల్లి గ్రామంలో బుగ్గరపు లాలయ్య, కాటారం గ్రామంలో సింగనవేని శ్రీధర్‌లు ఇటీవల మరణించగా వారి చిత్రపటాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి బాధిత కుటుంబ సభ్యులను పుట్ట మధు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు జక్కు రాకేష్, సింగిల్ విండో చైర్మన్ చల్లా నారాయణరెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు తోట జనార్ధన్, మంథని నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు భూపెళ్లి రాజు, మండల యూత్ అధ్యక్షుడు రామిళ్ళ కిరణ్, సింగిల్ విండో చైర్మన్ ఉపాధ్యక్షులు దొబ్బెట స్వామి, సర్పంచ్ అంతర్గాం రాజమౌళి, బీఆర్ఎస్ నాయకులు జిల్లా ఆర్యవైశ్య మహాసభ జోన్ చైర్మన్ అనంతుల రమేష్ బాబు, నాయకులు దబ్బేట రాజేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story