వరదల ప్రాంతాల నుంచి సేఫ్ జోన్‌లోకి.. రివ్యూ చేసిన మంత్రి హరీష్ రావు

by Javid Pasha |
వరదల ప్రాంతాల నుంచి సేఫ్ జోన్‌లోకి.. రివ్యూ చేసిన మంత్రి హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వరద ఉదృతి అధికంగా వున్నా జిల్లాలో దాదాపు 503 మంది గర్భిణీ మహిళలను సేఫ్ జోన్ లోకి తరలించారు. మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు గర్భిణుల ఆరోగ్య సంరక్షణ విషయంలో డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న గర్భిణులను ఆసుపత్రులకు తరలించారు. ఈనెల 20నుండి 26 వరకు 33 జిల్లాలో 327 మందిని, ఈనెల 27 న 176 మందిని మొత్తంగా 503 ఆసుపత్రుల్లోనీ బర్త్ వెయిటింగ్ రూములకు సురక్షితంగా తరలించారు. గర్భిణీ మహిళతో పాటు వారి వెంట అటెండెంట్ కి వసతితో పాటు, భోజన సౌకర్యం ప్రభుత్వం కల్పించింది.

జిల్లాలో పరిస్థితులపై మంత్రి రివ్యూ

గురువారం జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రివ్యూ నిర్వహించారు. అన్ని విభాగాల అధిపతులు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో వుండి వైద్య సేవల్లో అంతరాయం లేకుండా చూడాలని అధికారులను అయన ఆదేశించారు. సబ్ సెంటర్ స్థాయి నుండి హైదరాబాద్ లోని ప్రధాన ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బంది పూర్తి సంసిద్ధతతో ఉన్నారని మంత్రి తెలిపారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్కొన్నారు. జిల్లా, ఏరియా, సీహెచ్సీ, ఎంసీహెచ్ ఆసుపత్రుల వారీగా ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసారని తెలిపారు.

ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర స్థాయిలో 24×7 స్టేట్ లెవల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 040-24651119 ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ల‌ను ఏర్పాటు చేశారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది.. పంచాయతీ రాజ్, మున్సిపల్ తదితర శాఖల సమన్వయం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు చర్యలుచేపట్టామని అయన తెలిపారు. అన్ని బ్లడ్ బ్యాంకులలో అన్ని గ్రూపుల రక్తం తగినంత నిల్వలను ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలుషిత నీటి వలన కలిగే సంక్రమిత వ్యాధులపై జిల్లా వైద్య శాఖాధికారులు ఐ ఈ సి ద్వారా విస్తృతమైన ప్రచారాన్ని చేపట్టాలని అన్నారు. పిహెచ్‌సి వైద్యాధికారులు అందరి ఫోన్ నంబర్‌లను కలిగి ఉండాలని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రులతో ఆర్ ఎం ఓ లు సమన్వయం చేసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లను సందర్శించాలని వైద్యాధికారులకు అయన సూచించారు. అన్ని ఆసుపత్రులు మరియు పిహెచ్‌సిలు తగినన్ని ఔషధ నిల్వలను కలిగి ఉండాలని, యాంటీ స్నేక్ వెనమ్ (ఏఎస్వి )తో సహా అవసరమైన మందులు, అందుబాటులో ఉండేలా చూడాలని అయన ఆదేశించారు.

ఆర్ ఎం ఓ లు 24 గంటలూ అందుబాటులో ఉండాలని, వారి పేరు మరియు ఫోన్ నంబర్ బోర్డు మీద వ్రాసి ఉంచాలని సూచించారు. నీటిలో క్లోరినేషన్ ఉండేలా లైన్ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని జిల్లా వైద్య శాఖాధికారులను కోరారు. ఆసుపత్రి ఆవరణను శుభ్రంగా ఉంచాలని ఇందుకోసం హెచ్‌డిఎస్ నిధులను వినియోగించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్లకు సూచించారు. అన్ని ఆసుపత్రులలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ప్రతి వారం సమావేశం నిర్వహించి సమీక్షించాలని , ఆసుపత్రుల పైకప్పు లీకేజీలు ఏవైనా ఉంటే నిరోధించడానికి తక్షణ మరమ్మతులు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed