- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తీన్మార్ మల్లన్నకు మరింత పెరిగిన బలం.. బహిరంగ మద్దతు ప్రకటించిన PRTU
దిశ, తెలంగాణ బ్యూరో: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు పీఆర్‌టీయూ (ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్-తెలంగాణ) మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ఉపాధ్యాయ సంఘాల్లో పీఆర్‌టీయూ కూడా ఒకటి. ఈసారి ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్ననే బలపరుస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు.
సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బహిరంగంగానే తెలియజేయడంతో ఆ సంఘానికి అనుబంధంగా ఉన్న టీచర్లు (గ్రాడ్యుయేట్ ఓటర్లు) అనుకూలంగా ఓటు వేసే అవకాశమున్నది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌తో కలిసి ‘ఇండియా’ కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఎం సైతం తీన్మార్ మల్లన్నకే మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న పలు సంఘాలు సైతం తీన్మార్ మల్లన్నను బలపరుస్తూ తీర్మానం చేయడమే కాక ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో అనుకూల క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాయి.