- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCRపై కామారెడ్డిలో పోటీకి రెడీ.. : రేవంత్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: నన్నుగానీ సీఎల్పీ నేత భట్టిని గానీ కామారెడ్డిలో పోటీ చేయాలని అధిష్టానం అదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ ఆదేశిస్తే అది కామారెడ్డి అయినా సిరిసిల్లా అయినా ఎక్కడైనా తాము పోటీ చేసి కేసీఆర్, కేటీఆర్ ను చిత్తుచిత్తుగా ఓడిస్తామన్నారు. గురువారం ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో టీ కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ తో కలిసి మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఈ మూడు పార్టీలు చెడ్డీ గ్యాంగ్ లాంటిదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హంగ్ పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఈసారి కూడా ఉండబోదన్నారు. పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు.
రిటైర్డ్ అధికారులతో కేసీఆర్ ప్రైవేట్ ఆర్మీ
రిటైర్డ్ అయిన వారిని పదవుల్లోకి తీసుకొచ్చి విపక్షాలపై దాడులు చేసేందుకు ఉపయోగిస్తున్నారని అలాంటి వారిని పదవుల నుంచి తొలగించాలని ఈసీని కోరామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ కు మద్దతిస్తున్న అధికారులకు ఎన్నికల విధులు అప్పగించవద్దని కోరామన్నారు. జయేష్ రంజన్ లాంటి అధికారులు బీఆర్ఎస్ కు ఎన్నికల నిధులు ఇవ్వాలని వ్యాపారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. రిటైర్డ్ అయిన అధికారులను ప్రభుత్వ జీతభత్యాలతో కేసీఆర్ ప్రైవేటు ఆర్మీని నియమించుకున్నారని కొత్త ఆర్మీతో కాంగ్రెస్ నేతలపై దాడులు చేయించి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కీలకమైన శాఖలను కొందరు ఐఏఎస్ లు ఏడెనిమిది ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. అలాంటి వారిలో జయేశ్ రంజన్, అర్వింద్ కుమార్, సోమేశ్ కుమార్, స్మితా సభర్వాల్, స్టీఫెన్ రవీంద్ర లాంటి అధికారులను బదిలీ చేయాలని ఈసీని కోరినట్లు చెప్పారు.
పథకాలను ఆపామంటూ విషప్రచారం
సంక్షేమ పథకాలకు బీఆర్ఎస్ విధివిధానాలు పాటించడం లేదని, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు బదిలీలు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే అమలు చేయాలని ఎన్నికల అధికారులను కోరామన్నారు. సంక్షేమ పథకాలకు నిధులను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను ఆపాలని తాము చెప్పడం లేదని నవంబర్ 2 వ తేదీ లోపే వివిధ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదన్నారు. ఇప్పుడు ఏది వాయిదా పడినా మేం అధికారంలోకి వచ్చాక చెల్లిస్తామన్నారు. ప్రభుత్వ భవనాలను రాజకీయ కార్యకలాపాలకు వినియోగించకుండా చూడాలని ఈసీని కోరామని చెప్పారు.
మేడిగడ్డ కాదు కేసీఆర్ కుంగిపోవుడు ఖాయం
మేడిగడ్డ ఘటనను సంఘ విద్రోహ చర్య గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ విషయంలో కేసీఆర్ కామన్ సెన్స్ కోల్పోయారని.. పేలుడు పదార్థాలతో పేల్చితే పిల్లర్లు గాల్లోకి లేస్తాయి కానీ కుంగిపోవు కదా అని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగిపోవుడు కాదు కేసీఆర్ కుంగిపోవడు ఖాయం అని ఎద్దేవా చేశారు. ఇసుక కొట్టుకుపోతే పిల్లర్ కింగిపోయిందని ఎలా చెబుతారు?.. ఈ ఘటన పూర్తిగా నాణ్యతా లోపమే అన్నారు. అపారంగా బొగ్గుగనులు ఉన్న ప్రాంతంలో సాంకేతికంగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు.
ఇంత ప్రమాదం జరిగితే ఎల్ఆండ్ టీ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదని వారిని ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన వసూళ్లలో కొంత కేంద్రానికి కప్పం కింద చెల్లిస్తున్నాడని అందువల్లే కేంద్రం కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు చేరతారన్నది ఆయన ఇష్టం. బీజేపీ బీఆర్ఎస్ కు సహకరిస్తుందని వాళ్ళకు అర్థమైంది. అందుకే బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతలు వెనక్కి వస్తున్నారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తుపై మా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.
- Tags
- revanth reddy