- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిబ్రవరి 6న తెలంగాణకు ప్రియాంక.. ఇకపై ఆమె కనుసన్నల్లోనే T-కాంగ్రెస్..!
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌పార్టీపై ప్రియాంక గాంధీ ఫోకస్‌పెట్టారు. ఈ మేరకు ఫిబ్రవరి 6న ఆమె రాష్ట్రానికి వచ్చే ఛాన్స్ఉన్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. టీపీసీసీ నుంచి ఆహ్వానం కూడా వెళ్లినట్లు సమాచారం. గడపగడపకీ కాంగ్రెస్‌ను చేరవేసేందుకు ఏఐసీసీ ఆదేశాలతో నిర్వహిస్తున్న హాథ్‌సే హాథ్‌జోడో యాత్రలో పాల్గొనే అవకాశం ఉన్నది. పలు మండలాల్లో జరిగే ర్యాలీల్లో ప్రియాంక కూడా వస్తారని ఓ ముఖ్య నేత చెప్పారు.
ఆ తర్వాత టీపీసీసీ, ఏఐసీసీ, ఇతర అనుబంధ సంఘాలతో మీటింగ్‌ను ఏర్పాటు చేయాలని గాంధీభవన్‌వర్గాల ప్రణాళికను సిద్ధం చేస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ ఇక నుంచి ఆమె కనుసన్నల్లోనే ముందుకు వెళ్తుందని సీనియర్‌నేత తెలిపారు. సీనియర్ల వర్సెస్జూనియర్ల పంచాయితీ తెగిపోయిందని, ఇక నుంచి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమంటూ ఆయన వివరించారు.
మొదట్నుంచి ఆసక్తే..
తన నాయనమ్మ ఎంపీగా గెలిచిన గడ్డ అంటే ప్రియాంకకు మొదట్నుంచే ఆసక్తి ఉన్నదని ఏఐసీసీ సభ్యుల్లో ఒకరు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం సాధన సమయంలోనూ ఆమె అంతర్గతంగా ఒకే చెప్పినట్లు ఓ కీలక నాయకుడు చెప్పారు. రాష్ట్రంలో ఏదో ఒక పార్లమెంట్ సెగ్మెంట్‌నుంచి పోటీ చేయాలని గతంలో రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ ప్రపోజల్స్పెట్టినప్పుడు, ఇందిరమ్మ పోటీ చేసిన స్థానం వైపు ఆమె మొగ్గు చూపినట్లు ఆయన వివరించారు.
దీంతో ఈ ఎన్నికల్లో ఆమె కచ్చితంగా పోటీ చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రియాంక రాకతో కాంగ్రెస్‌లో మరిన్ని చేరికలు ఉంటాయని, బీఆర్ఎస్, బీజేపీ అసంతృప్తిలకు కాంగ్రెస్కండువా కప్పబోతున్నట్లు వివరించారు. పార్టీ యాక్టివిటీస్స్పీడ్ చేస్తూ ముందుకు సాగుతామని ఆయన 'దిశ'కు తెలిపారు.
Also Read...
గులాబీ జెండాలపై కొత్త భాషలు.. కేసీఆర్ తీరుతో BRS నేతల్లో కొత్త టెన్షన్..!