రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని ఆరోపణలు హాస్యాస్పదం: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కౌంటర్

by Shiva |
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని ఆరోపణలు హాస్యాస్పదం: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: తమ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు హాస్యాస్పందం ఉన్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ తమ ప్రభుత్వంపై అడ్డగోలుగా ఆరోపణలు చేయడం హస్యాస్పదమని అన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్‌తో మోడీ అలాయ్.. బలాయ్ చేసుకుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం కేంద్రం రూ.వేల కోట్ల లోన్లు ఇప్పించిందని ఆరోపించారు. ఇప్పుడు ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని ప్రధాని అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

పదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ఎందుకు కేసీఆర్ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టులపై విజిలెన్స్, జ్యుడీషియల్ విచారణకు ఆదేశించామని తెలిపారు. తెలంగాణకు గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఐటీఐర్ ఇస్తే.. మోడీ ప్రధాని అవ్వగానే దానిని రద్దు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన హామీలను బీజేపీ మరిచిపోయిందంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed