నేడు తెలంగాణకు ప్రధాని మోడీ.. మల్కాజ్‌గిరిలో రోడ్ షో

by GSrikanth |
నేడు తెలంగాణకు ప్రధాని మోడీ..  మల్కాజ్‌గిరిలో రోడ్ షో
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ నేడు తెలంగాణకు రానున్నారు. శుక్రవారం సాయంత్రం 4:55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి మోడీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి మల్కాజ్ గిరికి బయలుదేరనున్నారు. సాయంత్రం 5:15 గంటల నుంచి 6:15 వరకు రోడ్ షోలో మోడీ పాల్గొంటారు. ఈ రోడ్ షో దాదాపు 1.3 కిలోమీటర్ల దూరం సాగనుంది. రోడ్ షో ముగిసిన అనంతరం సాయంత్రం 6:40 గంటలకు ఆయన రాజ్ భవన్‌లో బస చేస్తారు. శనివారం ఉదయం 10:45 గంటలకు రాజ్ భవన్ నుంచి ప్రధాని మోడీ బయలుదేరి 11 గంటలకు బేగంపేట నుంచి నాగర్‌కర్నూల్ వెళ్తారు. ఉదయం 11:45 నుంచి 12:45 వరకు అక్కడ నిర్వహించే సభలో ప్రధాని పాల్గొంటారు. అది ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు నాగర్ కర్నూల్ నుంచి గుల్బర్గాకు వెళ్లనున్నారు. తిరిగి మళ్లీ 18వ తేదీన ఆయన రానున్నారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు.

Advertisement

Next Story

Most Viewed