- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని మోడీ నోట చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం మాట!
దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండాను రెపరెప లాడించడమే లక్ష్యంగా బీజేపీ పెద్దలు ప్రయత్నాలు స్పీడప్ చేశారు. ఇప్పటికే మిషన్ 90 పేరుతో కమలనాధులు బీఆర్ఎస్ పార్టీపై సమర శంఖం పూరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోడీ శనివారం రాష్ట్రంలో పర్యటించడం హాట్ టాపిక్ అయింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన సభలో కేసీఆర్ ప్రభుత్వంపై పరోక్షంగా చురకలు అంటించారు. నేరుగా కేసీఆర్, బీఆర్ఎస్ పాలనపై మోడీ ఎటాక్ చేస్తారని భావించినా అధికారిక కార్యక్రమం కావడంతో పరోక్షంగా ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపాయి. ప్రధాని ప్రసంగిస్తున్నత సేపు మోడీ.. మోడీ అనే నినాదాలతో పరేడ్ గ్రౌండ్ మార్మోగింది. అయితే మోడీ తన స్పీచ్ లో భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ను ప్రస్తావించడం హాట్ టాపిక్ అవుతోంది.
సెంటిమెంట్ ను కంటిన్యూ చేసిన మోడీ:
రాష్ట్రంలో కేసీఆర్ హవాకు చెక్ పెట్టాలని భావిస్తున్న బీజేపీకి ఆలయాల సెంటిమెంట్ కలిసి వస్తోంది. కేసీఆర్ హిందూ వ్యతిరేకి అనే విమర్శలు గుప్పిస్తూనే పార్టీ చేపట్టే ముఖ్యమైన కార్యక్రమాలను ప్రముఖ దేవాలయాల నుంచి ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించిన మోడీ.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి తిరుమల వెంకన్న ఆలయానికి ట్రైన్ వేశామని చెప్పడం ఆసక్తిగా మారింది. మొదటి నుంచి బీజేపీ భాగ్యలక్ష్మి అమ్మవారి సెటింమెంట్ గా పెట్టుకుంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించగా ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లేందుకు బండి సంజయ్ వివిధ దశలలో చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఓసారి ఇక్కడి నుంచే మొదలు పెట్టారు. ఇక తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ ను భాగ్యనగరంగా మారుస్తామని బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు పదే పదే చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ తాజా పర్యటనలో భాగ్యలక్ష్మి అమ్మవారి పేరును ప్రస్తావించడం హాట్ టాపిక్ అయింది.
ఇది మోడీ సెంటిమెంట్ పాలిటిక్స్:
భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి తిరుమల వెంకన్న వరకు ట్రైన్ వేశామన్న మోడీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తుందని అదే సికింద్రాబాద్ లో ఉన్న వినాయకుడి టెంపుల్ పేరును వదిలేసి చార్మినార్ లో ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం పేరును ప్రస్తావించడం మోడీ సెంటిమెంట్ రాజకీయాలకు నిదర్శనం అనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి.