- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాహుల్ గాంధీ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రధాని మోడీ.. జగిత్యాల సభలో సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ ఛాలెంజ్ ను తాను స్వీకరిస్తున్నా అని ప్రధాని మోడీ అన్నారు. జగిత్యాల విజయ సంకల్ప సభలో మోడీ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల నగారా మోగిందని.. ప్రపంచలోని అతిపెద్ద ఎన్నికల పండగ మొదలైందన్నారు. మే 13న తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందన్నారు. తెలంగాణలో బీజేపీకి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారన్నారు. వికసిత్ భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారన్నారు. మల్కా్జ్ గిరి రోడ్ షోలో ప్రజలు బ్రహ్మ రథం పట్టారన్నారు. మూడు రోజుల్లో తెలంగాణ రావడం ఇది రెండోసారి అన్నారు. తెలంగాణ కోసం రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్ 400 పార్ అంటున్నారన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పని అయిపోతుందని.. జూన్ 4న ఎన్డీయేకు 400 సీట్లు దాటాలన్నారు.
‘ప్రధాని మోడీ 400 దాటాలి.. బీజేపీకి ఓటు వేయాలి’ అనిని తెలుగులో చెప్పి సభకు వచ్చిన వారిని పీఎం ఉత్సాహపరిచారు. తాను భారతమాతకు పూజారీని అన్నారు. తనకు ప్రతి మహిళా ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తోందన్నారు. చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతాన్ని కూడా శివశక్తి అని పేరు పెట్టుకున్నామన్నారు. శక్తిని వినాశనం చేసేవాళ్లకు.. శక్తికి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరుగుతోందన్నారు. శివాజీ మైదానంలో రాహుల్ గాంధీ.. తన పోరాటం శక్తికి వ్యతిరేకంగా అని చెప్పారని.. శక్తిని వినాశనం చేస్తానని ఎవరైనా అంటారా మోడీ ఫైర్ అయ్యారు. శక్తిని ఖతమ్ చేస్తానన్న రాహుల్ గాంధీ ఛాలెంజ్‌ను తాను స్వీకరిస్తున్నా అన్నారు. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4 న తెలుస్తుందన్నారు. అంతకుముందు తెలుగులో తన ప్రసంగాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు.