- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. షెడ్యూల్ ఫిక్స్
దిశ, వెబ్‌డెస్క్: కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో పర్యటించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu).. మరోసారి తెలంగాణకు రానున్నారు. రెగ్యులర్ షెడ్యూల్ లో భాగంగా శీతాకాల విడిది(winter vacation)కి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉన్న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి(President's residence in Bollaram) ముర్ము రానున్నారు. రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 16 నుంచి 21 వరకు ఆరు రోజుల పాటు.. ఆమె హైదరాబాద్ లో ఉండనున్నారు. అలాగే ఈ నెల 21న తెలంగాణలో శీతాకాల విడిది ముగించుకొని.. నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రౌపది ముర్ము వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రపతి రాకతో ఈ నెల 16 నుంచి 21 వరకు నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అలాగే అధికారులు కూడా ఇప్పటికే భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.