ప్రభుత్వ సిటీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం ప్రకటన

by Kalyani |
ప్రభుత్వ సిటీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం ప్రకటన
X

దిశ, చార్మినార్ : 2024-25 సంవత్సరానికి గాను ప్రభుత్వ సిటీ కళాశాల (అటానమస్)లో స్టాటిస్టిక్స్ విభాగంలో తాత్కాలిక అతిథి అధ్యాపక నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.బాల భాస్కర్ తెలిపారు. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తు, అర్హతల ఒరిజినల్స్, ధ్రువీకరణ పత్రాలతో డిసెంబర్ 4వ తేదీ సంబంధిత శాఖలో ఇంటర్వ్యూ కు హాజరు కావాలని ఆయనఒక ప్రకటనలో తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 55 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని, పిహెచ్ డి, ఎం.ఫిల్, నెట్, స్లెట్ వంటి అదనపు అర్హతలతోపాటు బోధనానుభావం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఇతర వివరాల కోసం డి.శ్రవణ్ కుమార్ సెల్ నెంబర్ 98482 74530కు సంప్రదించవలసిందిగా ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed