- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘పుష్ప-2’ విడుదలకు ముందు నాగబాబు సెన్సేషనల్ ట్వీట్.. అల్లు అర్జున్‌ను ఉద్దేశించేనా?
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna) కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’(Pushpa 2: The Rule). ఈ సినిమా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వం వహించారు. అయితే దీనిని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ భారీ హైప్ పెంచుతున్నారు. పాట్నా, ముంబై(Mumbai), కొచ్చిలో పలు ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్(Hyderabad)లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌గా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, నాగబాబు(Nagababu) ట్వీట్ పుష్ప-2 గురించే చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
‘‘నువ్వు తప్పుడు దారిని ఎంచుకున్నావు అని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గమనించి సరి చేసుకో.. లేదంటే ముందు ముందు ఆ దారి నీకు మరింత కష్ట తరంగా మారగలదు. తప్పును సరిదిద్దుకో’’ అని స్వామి వివేకానంద చెప్పిన మాటలు షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ అల్లు అర్జున్(Allu Arjun)ను ఉద్దేశించే చేశారని నెటిజన్లు అంటున్నారు. కాగా, గత కొద్ది కాలంగా అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య వివాదం కొనసాగుతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ జనసేన(Janasena)కు కాకుండా వైసీపీ అభ్యర్ధికి సపోర్ట్‌గా నిలవడంతో అప్పటినుంచి ఘర్షణ కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ నాగబాబు నిత్యం పలు పోస్టులు చేస్తూ కాంట్రవర్సీ చేస్తున్నారు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం ఉన్నట్లు అంతా ఫిక్స్ అయిపోయారు. గత కొద్ది రోజుల నుంచి మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాగబాబు ట్వీట్ చేయడంతో ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) గురించే చేశారని అంటున్నారు.
Read More...
Pushpa 2: లండన్ వీధుల్లో ఐకాన్‌స్టార్ ఫ్యాన్స్ అదిరిపోయే స్టెప్పులు..!!