మరింత విషమంగా ప్రీతి ఆరోగ్యం..

by Mahesh |
మరింత విషమంగా ప్రీతి ఆరోగ్యం..
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక KMC కి చెందిన ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కేఎమ్‌సీలో అనస్తీషియా లో పీజీ చేస్తున్ ప్రీతి.. సీనియర్ విద్యార్థి వేధింపులకు సుసైడ్ ప్రయత్నం చేసింది. కాగా ఈ సంఘటన పై ప్రితీ బాబాయ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. 2022 నవంబర్ లో ప్రీతి కాకతీయ మెడికల్ కాలేజ్‌లో జాయిన్ అయిందని.. డిసెంబర్ నుంచి ప్రీతి కి వేధింపులు మొదలయ్యాయని తెలిపారు.

అలాగే సైఫ్ అనే సీనియర్ విద్యార్థి ప్రీతి కులం పేరుతో దూషించి.. వేధింపులకు గురి చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. ఈ ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించిన.. తన కుతురుకు ఇలాంటి పరిస్థితి తెచ్చిన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story