ప్రీతి కేసులో ట్విస్ట్.. సోదరుడి సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
ప్రీతి కేసులో ట్విస్ట్.. సోదరుడి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్ భరించలేక డాక్టర్ ప్రీతి ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. తాజాగా, ప్రీతి సోదరుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రిమాండ్ రిపోర్టులో అనేక అంశాలు మిస్సయ్యానని అన్నారు. డాక్టర్ల సమక్షంలో కౌన్సెలింగ్ జరుగలేదు. ఆ మరుసటి రోజే మా అక్క చనిపోయింది. మా అక్క మొబైల్‌లో చాటింగ్ కూడా డిలీట్ అయింది. చాట్ రిట్రీవ్ చేసి పూర్తి విషయాలు బయటపెట్టాలి. ప్రీతి హత్యే అనేందుకు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి.’ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Next Story