- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు పాలైన ‘ప్రజాపాలన’ అప్లికేషన్లు..! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఐదు గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్లను ప్రజాపాలన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నారు. కానీ కొద్ది రోజులకే ఈ ప్రజాపాలన అప్లికేషన్లు రోడ్డుపై దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో ఓ వ్యక్తి ప్రజాపాలన అప్లికేషన్లను అట్టపెట్టెలో పెట్టుకుని బైక్ పై తీసుకెళ్తుండగా.. బాక్స్ కిందపడి పగిలిపోయి.. అప్లికేషన్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. దీంతో రోడ్డుపై వెళ్తున్న వారు. ఆ ఫామ్స్ చూసి షాక్ అయ్యారు. ఎక్కడో ప్రభుత్వ కార్యాలయంలో ఉండాల్సిన అప్లికేషన్స్ నడిరోడ్డుమీదకు ఎందుకు వచ్చాయి. ఎక్కడ నుండి తీసుకు వస్తున్నావు. ఎవరు ఇచ్చారు. అని ప్రశ్నించగా సదరు వ్యక్తి పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో అటుగా వెళుతున్న వాహనదారుల అతన్ని నిలదీయడం ఆ వీడియో కనిపించింది.
ప్రజా పాలన అప్లికేషన్లు ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకు 5 రూపాయల చొప్పున ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చినట్లు తెలుస్తుంది. హయత్ నగర్ సర్కిల్‌కు చెందిన అప్లికేషన్లు కూకట్పల్లికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా.. ఓ వ్యక్తి రాపిడోకు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వ ప్రతిష్టాత్మక అప్లీకేషన్లు ఇలా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం ఎంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి అసలు నిజం ఎంటనే విషయం తెలియాలంటే అధికారులు స్పందించాల్సి ఉంది.
Read More..