Ponnam Prabhakar: రావాల్సిన నిధులనే కేంద్రాన్ని అడుగుతున్నాం: మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |
Ponnam Prabhakar: రావాల్సిన నిధులనే కేంద్రాన్ని అడుగుతున్నాం: మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫెడరల్ సిస్టమ్ స్ఫూర్తితో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులనే తాము అడుగుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సెక్రటేరియట్‌లోని మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరగుతున్న వేళ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులగా బాధ్యతలు స్వీకరించిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి బడ్జెట్‌లో నిధులు కేటాయించేలా చూడాలన్నారు. గతంలో వారికి రాష్ట్ర సహకరించలేదని సాకు చెప్పకుండా.. అన్ని విషయాలు చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

హైదారాబాద్‌ మహానగరానికి DMFT కి సంబంధించిన నిధుల త్వరగా కేటాయించేలా చొరవ చూపలన్నారు. మెట్రో వాటర్ వర్క్స్, మౌలిక సదుపాయాల కల్పన, చెరువుల అభివృద్ధి, 141 వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కేంద్రం తోడ్పాటునందిచాలని అన్నారు. అదేవిధంగా మెట్రో, ఔటర్ రింగ్ రోడ్డు అంశాల‌పై రాష్ట్రానికి న్యాయం చేయాలని అన్నారు. తెలంగాణ‌లోని అన్ని జిల్లాలకు న్యాయం జరిగేలా ప్రవేశ పెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని తెలిపారు. రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు, సైనిక్ స్యూళ్లుచ బయ్యారం ఉక్కు కర్మాగారంతో పాటు విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని కోరారు. అదేవిధంగా సామన్యులను దృష్టిలో పెట్టుకుని నిత్యవసర వస్తువుల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కూడా రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నారు. నిరంతరం ప్రజలకు సేవలందింస్తున్న గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు, ఉస్మానియా యూనివర్సిటీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీలకు నిధులు మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 17 మంది లోక్‌సభ, 8 మంది రాజ్యసభ సభ్యులు సమన్వయం చేసుకొని పని చేయాలని ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రా మధ్య వివాదాలు సామరస్యంగా పరిష్కరించుకుంటామని ఆ విషయంలో కేంద్రం సహకారం ఉండాన్నారు. హైదరాబాద్ చరిత్రాత్మకమైన నగరమని.. టూరిజం అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వచ్చేలా కేంద్ర మంత్రులు చొరవ తీసుకోవలన్నారు.



Next Story