- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేను అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణాన్ని ఆయన ఆ సభా వేదికగా తెలిపారు. బీఆర్ఎస్ నుంచి తాను బయటకు వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పలు ప్రజా సంఘాలు, నాయకులు, ప్రజలతో మాట్లాడానని చెప్పారు. ఈ సందర్భంగా తాను ఏ పార్టీలో చేరాలని అడిగితే.. అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలిపారని చెప్పారు.
అందుకే తాను నేరుగా ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పానని పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో విసిరివేయడానికే తాను కాంగ్రెస్ లో చేరినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను, ఆయన పార్టీ ఎమ్మెల్యేలను చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.