- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM సభకు వెళ్తుండగా యాక్సిడెంట్.. కనీసం స్పందించరా..? పొంగులేటి ఫైర్
ఖమ్మం: కూసుమంచి మండలం నాన్ తండా వద్ద శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు చనిపోయి, అనేక మంది గాయపడిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం స్పందించలేదని, ఆయనకు మానవత్వమే లేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. జీళ్లచెరువులో సీఎం సభకు వెళుతుండగానే ఈ ప్రమాదం జరిగినప్పటికీ.. సానుభూతి కూడా వ్యక్తం చేయని కఠినాత్ముడుగా మిగిలిన ఆయన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. ఖమ్మంలోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉదయం పరామర్శించారు.
ఈ సందర్భంగా పలువురు పొంగులేటితో మాట్లాడుతూ.. తామంతా ఇంత దుఃఖంలో ఉన్నా సీఎం కనీసం ఎలాంటి ప్రకటన కూడా చేయలేదని రోదించారు. అందరినీ కలిసి ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని, పూర్తిగా కోలుకునేవరకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. వైద్య సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన అనసూర్య కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే క్షతగాత్రులకు రూ.10లక్షల చొప్పున చెల్లించి ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ఉందని గుర్తు చేశారు.