- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగరేణి వ్యాప్తంగా 11 పోలింగ్ కేంద్రాలు.. 39,773 మంది ఓటర్లు
దిశ ప్రతినిధి, కొత్తగూడెం: తెలంగాణ వ్యాప్తంగా సింగరేణి ఎన్నికల పోలింగ్ మొదలైంది. రీజనల్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాల్లో పోలింగ్ షురూ అయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో 39, 773 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు.
రామగుండం ఏరియాలోని ఆర్జీ-1లో 5404, ఆర్జీ-2లో 3557, ఆర్జీ-3లో 3884 ఓటర్లు కాగా.. మొత్తం 12 వేల 8 వందల 45 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. 6 జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో కార్పోరేట్ లో 1,191 మంది, కొత్తగూడెం ఏరియాలో 23,031 మంది, ఇల్లెందులో 613 మంది, మణుగూరులో 2,452 మంది, రామగుండం-1 లో 5,404 మంది, రామగుండం-2 లో 3,557 మంది, రామగుండం-3 లో 3,884 మంది, భూపాలపల్లిలో 5,395 మంది, బెల్లంపల్లి లో 998 మంది, మందమర్రిలో 4,838 మంది, శ్రీరాంపూర్ లో 9,149 మంది మొత్తంగా 39 వేల 809 మంది ఓటర్లు ఉన్నారు. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.