- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అల్లర్లకు అమిత్ షాయే కారణం.. ఆయనను తెలంగాణకు రానివ్వద్దు'
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అల్లర్లకు అమిత్ షాయే ప్రధాన కారణమని, ఆయన తెలంగాణకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని అప్పీలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలిపారు. గురువారం ఐఅండ్ పీఆర్ భవన ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొట్లాడి తెలంగాణను సాధించుకున్నది అల్లర్ల కోసమా? అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని బీజేపీ నేతలు కావాలని అల్లర్లు సృష్టిస్తున్నారని, విద్వేష మాటలు మానుకోవాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం ఎంతకైనా తెగిస్తామనే విధంగా ప్రవర్తిస్తూ గెలుపుకోసమే బీజేపీ రాష్ట్రంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ చిచ్చుపెడుతుందని మండిపడ్డారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో గెలువడానికి చేసిన ప్రయత్నాలనే ఇప్పుడు మునుగోడులో చేస్తుందని ధ్వజమెత్తారు. బీజేపీ గుండాల పార్టీనా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలను ప్రజలు తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. వారి ఆగడాలకు ఫుల్ స్టాప్ పడుతుందన్నారు. అమిత్ షా రాష్ట్రానికి రాకుండా అడ్డుకోవాల్సి ఉందన్నారు.