- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ 9 రోజులు సురేశ్ ఏం చేశాడు?.. ఆరా తీస్తున్న పోలీసులు
దిశ, సిటీక్రైం: వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో ఈ నెల 11 న జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర రెవెన్యూ అధికారుల మీద జరిగిన దాడి ఘటనలో ఏ-2 గా ఉన్న బొమ్మమోని సురేశ్ పరారీలో ఉన్నప్పుడు ఏం చేశాడా? అని ఆరా తీసే పనిలో పడ్డారు. 9 రోజుల పాటు పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్న సురేశ్ చివరికి మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన సురేశ్ ప్రస్తుతం సంగారెడ్డి జైలులో ఉన్నాడు. సురేశ్‌ను కస్టడికి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేశారు. కోర్టు అనుమతి రాగానే సురేశ్‌ను కస్టడిలోకి తీసుకుని ఆ వివరాలన్నీ అడిగి తెలుసుకునే అవకాశం ఉంది.
ముఖ్యంగా సురేశ్ పరారీలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ బస చేశాడు? ఎవర్ని కలిశాడు? అతనికి ఎవరెవరు ఏలా సహకరించారు? అనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించే అవకాశం ఉంది. అంతేకాకుండా లగచర్ల ఘటన వెనుక ఉన్న కీలక పాత్రధారుల గురించి కూడా విచారించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ 9 రోజుల్లో సురేశ్‌కు సహకరించిన వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే సురేశ్‌ను హైదరాబాద్‌లోని ఓ పార్టీ కార్యాలయంలో దాచిపెట్టారనే అనుమానాలు, పుకార్లు ప్రచారంలో ఉండడంతో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.