K.A. Paul : రేవంత్ రెడ్డి అల్లుడిపై కే.ఏ.పాల్ కీలక వ్యాఖ్యలు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-20 10:01:51.0  )
K.A. Paul : రేవంత్ రెడ్డి అల్లుడిపై కే.ఏ.పాల్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CMRevanth Reddy) సొంత అల్లుడు మాక్స్బిన్ ఫార్మాసూటికల్ కంపెనీలో డైరక్టర్ అని, వీళ్లకు వందల, వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్(K.A. Paul)ప్రశ్నించారు. కొడంగల్ లో రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని, ఈ సమస్యను వదిలేది లేదన్నారు. కామారెడ్డి రైతులకు 2023లో అన్యాయం జరుగుతుంటే నేను వారి కోసం న్యాయ పోరాటం చేసి ఆదుకున్నానని గుర్తు చేశారు. కొడంగల్ రైతుల కోసం న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో నేను కొడంగల్ వస్తున్నాను.. మీరు తొందర పడి ఆత్మహత్యలు చేసుకోకండి, వీళ్ళ అవినీతి బైట పెడుదామని, మీకు న్యాయం చేయడానికి నేను ఉన్నానని పాల్ చెప్పుకొచ్చారు.

పాలకుల అవినీతిని బహిర్గతం చేద్ధామని, కోర్టులకు వెలుదామని, దేవుడిని కూడా ప్రార్ధిద్దామన్నారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఈ పార్టీలను చిత్తుగా ఓడించి ప్రజాశాంతి నుంచి పోటీచేసే వారిని గెలిపించుకోవాలని, మార్పు తెద్దామని సూచించారు. రేవంత్ రెడ్డికి ముందు 7లక్షల కోట్లు అప్పు ఉంటే ఇప్పుడు రేవంత్ ఏడాది పాలనలో అది మరింత పెరిగిందన్నారు. వారికి లక్షల కోట్ల ఆదాయం.. మనకు లక్షల కోట్లు అప్పు అని ఈ పరిస్థితిని ప్రజలే మార్చాలని కేఏ పాల్ తెలిపారు.

Advertisement

Next Story