Pawan Kalyan:‘మరో పదేళ్లు ఆయనే సీఎంగా ఉండాలి’.. డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
Pawan Kalyan:‘మరో పదేళ్లు ఆయనే సీఎంగా ఉండాలి’.. డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ఐదు సంవత్సరాలు కాదు మరో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం 150 రోజుల పరిపాలన పై ఆయన శాసనసభలో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినందుకు సీఎంకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి అని చంద్రబాబు నిరూపించారని పేర్కొన్నారు. బుడమేరు వరద సమయంలో ఆయన చూపించిన చొరవ ఎంతో గొప్పది. ఆఫీసులో కూర్చుని ఆదేశాలు ఇవ్వగలిగే సత్తా ఉన్నా కూడా అధికారుల్లో ప్రజల్లో ధైర్యం నింపడానికి బురదలో సైతం దిగారు అని గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి శిథిలమై పోయిన రోడ్లు, గంజాయి, ఇసుక దోపిడీలు రివర్స్ టెండరింగులు, నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు, ఆలయాల్లో అపవిత్రం, మద్యం దోపిడీలు, వారసత్వంగా వచ్చే అని పేర్కొన్నారు.

అనుభవమున్న చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. గత ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకు వెళ్లిందని తెలిపారు. గత ప్రభుత్వం పాస్ బుక్‌లో కూడా ముఖ్యమంత్రి ఫోటోలు వేయించుకున్నట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం లో నెల మొదటి రోజున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. 64 లక్షల లబ్ధిదారులకు 4000 చొప్పున పెంచి అందిస్తున్నామన్నారు. బూతులు పోస్ట్ చేసే సోషల్ యాక్టివిటీస్ ల అణచివేతలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత తీసుకున్న కఠినమైన చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే కొనసాగాలని కోరుకున్నట్టు తెలిపారు. 'సీఎం చంద్రబాబుకు మాట ఇస్తున్నా, మేం చేయాల్సిన పనులపై ఆదేశాలు ఇవ్వాలి.. సీఎం చంద్రబాబు విజన్‌కు తగ్గట్టు పనిచేస్తాం.. సీఎం కలలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం.. ఐదేళ్లు కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలి.. చంద్రబాబు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి.. 'అని ఆయన ముగించారు.

Advertisement

Next Story

Most Viewed