ఎన్నికల వేళ తెరపైకి ఎమ్మెల్యే, ఎంపీల క్రైమ్ ఫైల్స్ స్టడీ

by Mahesh |   ( Updated:2023-06-26 03:18:26.0  )
ఎన్నికల వేళ తెరపైకి ఎమ్మెల్యే, ఎంపీల క్రైమ్ ఫైల్స్ స్టడీ
X

దిశ, రాచకొండ : రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అలర్ట్ అవుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీ లపై ఏమైనా కేసులు ఉన్నాయా? ఉంటే ఆ కేసుల తాజా విచారణ, దర్యాప్తు స్థితి ఏమిటి వాటిలో అరెస్టులు, నోటీసులు జారీ, పెండింగ్ వారెంట్ లు ఏమైనా ఉన్నాయా, ఎన్ బీ డబ్ల్యూ పెండింగ్ లో ఉన్నాయా వంటి అంశాల ఫైల్ ల చిట్టా ను పోలీస్ శాఖ సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అధికారులు ఎలక్షన్ కమిషన్ నిబంధనల ఉల్లంఘనల కేసుల చిట్టాను సిద్ధం చేస్తున్నారని సమాచారం. దీంతో పాటు ఎమ్మెల్యే, ఎంపిల ఫై నమోదైన కేసుల వివరాల సమస్త సమాచారాన్ని పోలీసులు ప్రత్యేక డేటా లోకి తీసుకు వస్తున్నారు.

దీంతో ఇప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధుల ఫై నమోదైన కేసులతో పాటు ఇతర నేరస్థులు, ఎలక్షన్ నేరాలకు పాల్పడిన వారి చిట్టా ఇప్పుడు పోలీసుల వద్ద చిటికె వేస్తే దొరికేలా భద్రపరుస్తున్నారు. ప్రజాప్రతినిధుల పై నమోదైన కేసులలో వారిపై జరిగిన దర్యాప్తు, విచారణ వివరాల పత్రాలు, అరెస్టు, పరారీ, బెయిల్ వంటి వివరాలను పోలీసు అధికారులు రెడీగా పెట్టుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ అడిగిన వెంటనే అందించిందేకు సమాయత్తం అవుతున్నారు. ఈ ప్రక్రియతో ఎమ్మెలే, ఎంపీల క్రైమ్ ఫైల్స్ ఆసక్తికరంగా మారనుంది. ఈ దఫా ఎన్నికైన ప్రజాప్రతినిధులు చాలా మందిపై భూ కబ్జా, ఆర్థిక వ్యవహారాలలో మోసం, బెదిరింపులు, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలతో ఫిర్యాదులు ఉన్నాయి.

Advertisement

Next Story