- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవన్ రెడ్డి అనుచరుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (Jeevan Reddy) అనుచరుడు గంగారెడ్డి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంతోష్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారుతో పాటు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. హత్య చేయడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ముందుగా సంతోష్ సెల్‌ఫోన్ డేటాను పరిశీలించిన పోలీసులు.. ఘటనకు ముందు నిందితుడు ఎవరెవరితో మాట్లాడాడో తెలుసుకున్నారు. అయితే హత్యకు కొద్ది రోజుల ముందు నుంచే నిందితుడు ప్లాన్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ హత్యోదంతంతో జగిత్యాల (Jagtial)లో పోలీసులు అలెర్ట్ అయ్యారు. హుటాహుటిన ఎమ్మెల్యే సంజయ్ ఇంటివద్ద భారీగా పోలీసులు మొహరించి భద్రత కల్పిస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్లే అన్ని దారుల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించి అన్ని దారులను దాదాపు క్లోజ్ చేశారు.