- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోడూ.. పాయె! అమలు కానీ సీఎం కేసీఆర్ హామీ
‘పోడు భూముల పట్టాల పంపిణీపై ప్రభుత్వం ఓ క్లారిటీతో ఉన్నది అధ్యక్షా... అటవీకి నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే పట్టాలు అందజేస్తాం. అందుకు అవసరమైన నియమ నిబంధనలు కూడా తయారు చేస్తున్నాం. ఇక నుంచి అటవిని నరకకుండా ఉంటామని గ్రామసభల్లో తీర్మానాలు చేపిస్తాం. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు హామీలతో ఈ ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు పోడు భూముల పట్టాలు పంపిణీని మొదలు పెడతాం. గిరిజనులు ఎవ్వరూ టెన్షన్పడాల్సిన అవసరం లేదు’
- సీఎం కేసీఆర్ (ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో)
దిశ, తెలంగాణ బ్యూరో : ఫిబ్రవరి చివరి నాటికి పోడు పట్టాల పంపిణీ ప్రారంభిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు కావడం లేదు. ఫిబ్రవరి ముగిసినా పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. పైగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ఉన్నదని ఆయా జిల్లాల అధికారులు ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. మరో వైపు పోడు భూములపై సర్కార్డబుల్గేమ్ఆడుతున్నదని ప్రతిపక్షాలు, ఆదివాసీ సంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
పోడు భూములు 11.2 లక్షలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్దకు వచ్చిందని, వాటన్నింటికీ పట్టాలు ఇవ్వబోతున్నట్టు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆశలు పెరిగాయి. ఫిబ్రవరి నెలాఖరుకే పట్టాలు పంపిణీ స్టార్ట్చేస్తామని, ఎమ్మెల్యేలు దగ్గరుండి మరీ పంపిణీ చేయాలంటూ సీఎం చెప్పుకొచ్చారు. కానీ అసలు ప్రాసెస్ ఇప్పటికీ మొదలు కాలేదు.
2014, 2018 ఎన్నికల్లోనూ హామీ
2014, 2018 ఎన్నికల్లోనూ పోడు భూములకు పట్టాలు ఇస్తామంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ కనీసం ఒక్కరికి కూడా పట్టాలు ఇవ్వలేదు. పోడు పట్టాలు పంపిణీ చేస్తామంటూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ.. సీఎం హామీ ఇస్తున్నారు. కానీ దానిని అమలు చేసేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కావడం లేదు. దీంతో అధికారులు సైతం ఈ ప్రక్రియపై ముందడుగు వేయడం లేదు. ఫలితంగా పట్టాల కోసం పోడు సాగుదారులు కలెక్టరేట్లు, ఎంఆర్‌వో కార్యాలయాల చూట్టూ తిరగాల్సి వస్తున్నది.
సాకులు చెబుతూ దరఖాస్తులు రిజక్ట్
పోడు పట్టాల కోసం వచ్చిన దరఖాస్తులను వివిధ సాకులు చూపుతూ ఫారెస్ట్ అధికారులు తిరస్కరిస్తున్నారు. ప్రతి గ్రామంలో కేవలం 20 శాతం చొప్పున మాత్రమే ఎంపిక చేస్తున్నారు. మిగతా వారి దరఖాస్తులను రిజెక్ట్చేస్తున్నారు. ఎందుకు తిరస్కరించారనే కారణాన్ని కూడా చెప్పడం లేదు. ఛాయ ఉపగ్రహానికి దొరకలేదంటూ మరి కొందరకి సాకులు చెబుతూ వారి దరఖాస్తులు రిజక్ట్ చేస్తున్నారు.
ఇక అన్ని విధాలుగా అర్హత ఉన్న వారి దరఖాస్తులనూ తిరస్కరిస్తున్నారు. ఫారెస్ట్, గ్రామ స్థాయిలోని కొందరు ప్రజాప్రతినిధులు కుమ్మక్కై గిరిజనులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పోడు సాగుదారుల స్పష్టమైన వివరాలు ప్రభుత్వం వద్దకు రాలేదని స్వయంగా అధికారులు చెప్పడం గమనార్హం. దీంతో ఈ సారి కూడా పోడు పట్టాలు లబ్ధిదారుల చేతికి వచ్చే వరకు ప్రభుత్వంపై నమ్మకం లేదని ఆదివాసీ సంఘ నాయకులు చెబుతున్నారు.
ప్రభుత్వానికి పట్టాలు ఇచ్చే ఉద్దేశం లేదు
- వెంకట్రామయ్య, ఆదివాసీ సంఘం నాయకులు
కేసీఆర్ప్రభుత్వం పోడు పట్టాల అంశంలో చట్టాలను ఉల్లంఘిస్తున్నది. బీఆర్ఎస్ప్రభుత్వానికి పోడు పట్టాలు ఇచ్చే ఉద్దేశం లేదు. ఎనిమిదిన్నర ఏండ్లుగా ప్రభుత్వం ఇలాంటి మోసపూరిత హామీలే ఇస్తున్నది. శాటిలైట్సర్వే అనేది చట్టంలో లేదు. కానీ దాని ఆధారంగా చాలా మంది అప్లికేషన్లు తిరస్కరించడం దారుణం. ఆదివాసీ ప్రాంతాల్లో ఏండ్ల తరబడి నివసించే గిరిజనేతరులూ పోడు పట్టాలకు అర్హులని చట్టం చెబుతున్నది. ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇష్టారీతిలో దొంగ హామీలు ఇస్తున్నది. రాబోయే ఎన్నికల్లో గిరిజనులు ప్రభుత్వానికి తప్పకుండా బుద్ది చెబుతారు.