- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: మంత్రి కోమటిరెడ్డి
దిశ, చిట్యాల : వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రత నియమాలను విధిగా పాటించాలని రాష్ట్ర రోడ్డు భవనాల, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. ఆదివారం చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామ పరిధిలో గల ధూన్ పంజాబీ ధాబా వద్ద నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా ఆయన ఆర్టీసీ ఆధ్వర్యంలో వాహన చోదకులకు నిర్వహించిన ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలను సరిగా పాటించకపోవడం వల్లే తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.
జాతీయ రహదారి 65 పై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి సంబంధిత కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లి హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పై మాట్లాడి త్వరలోనే రోడ్డు విస్తరణ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రోడ్డు విస్తరణ పనులు వేగ వింతగా పూర్తయ్యేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎస్పీ శరత్ చంద్ర పవర్, మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పోకల దేవదాస్, పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య యాదవ్, మారగోని ఆంజనేయులు, ఎద్దుల పూరి కృష్ణ, గుడిపాటి లక్ష్మి నరసింహ, పందిరి శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు..