రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు చంద్రకళ ఎంపిక

by Sridhar Babu |
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు చంద్రకళ ఎంపిక
X

దిశ, ఎర్రుపాలెం : ఖమ్మం జిల్లా ఖో ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల నాలుగవ తేదీన కల్లూరు మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఖో ఖో పోటీల్లో సీనియర్ మహిళల విభాగంలో ఖమ్మం ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఎర్రుపాలెం గ్రామానికి చెందిన చంద్రకళ రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికైంది.

ఈ మేరకు జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నర్సయ్య తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు జనవరి ఏడవ తేదీ నుండి పదవ తేదీ వరకు వరంగల్ స్టేడియంలో జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా ఖో ఖో పోటీల్లో పాల్గొననున్నట్లు వారు తెలిపారు. ఎంపికైన చంద్రకళ ను గ్రామస్తులు, పీఈటీ పి.వేణు, పలువురు రాజకీయ నాయకులు, తోటి విద్యార్థులు అభినందించారు.

Advertisement

Next Story