Mettu Sai Kumar: గాంధీ భవన్ లో రైతు భరోసా సంబరాలు

by Ramesh Goud |
Mettu Sai Kumar: గాంధీ భవన్ లో రైతు భరోసా సంబరాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతులకు ఎలాంటి లబ్ధి జరగలేదని, కానీ ప్రజా ప్రభుత్వంలో రైతన్న సంక్షేమం కోసం కృషి చేస్తుంటే అడ్డుకోవడం సరికాదని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు. ఆదివారం ఆయన గాంధీభవన్ లో జరిగిన రైతు భరోసా సంబురాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల కృతజ్ఞత తీర్మానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ....బీఆర్ఎస్ నేతలకు బుద్ధి లేదన్నారు. పేదల కోసం పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలను అమలు చేయనున్నదని తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ నైజం అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. ప్రతిపక్షాల వైఖరిని ప్రజలు, రైతులు గమనించాల్సిన అవసరం ఉన్నదన్నారు. మోసాలకు కేరాఫ్​అడ్రస్ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలంటూ మండిపడ్డారు.

Advertisement

Next Story