TPCC: కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకో.. మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్

by Ramesh Goud |
TPCC: కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకో.. మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) ఆత్మపరిశీలన చేసుకోని, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు. రైతు భరోసా(Raithu Bharosa)పై ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన.. బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో రైతు భరోసా ఈ నెల 26న ఇవ్వాలన్న నిర్ణయంపై టీపీసీసీ(TPCC) హర్షం వ్యక్తం చేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటామని, ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నామని తెలిపారు. రైతు భరోసా కింద ఎకరాకు 12 వేలు, అలాగే భూమి లేని రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12 వేలు ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఓ మైలు రాయి అని చెప్పారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసల సృష్టించినదని, రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి, దాదాపు ఏడున్నర లక్షల కోట్ల అప్పుల్లో కూర్చోపెట్టినదని మండిపడ్డారు. ఇంత ఆర్థిక నిర్భందం ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాను ఈ నెల 26 నుంచి ఇవ్వడం అనేది హర్షించదగ్గ విషయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతులకు మేలు చేస్తుంటే, రైతులను పదేళ్లుగా నిలువెత్తున ముంచి అప్పుల పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు.. ముఖ్యంగా కేటీఆర్(KTR) హర్షించాల్సింది పోయి విమర్శలు చేయడం తగదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏం చేశమో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని, నిజంగా ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలని అన్నారు. ప్రజలకు మంచి జరిగే విషయాలపై హర్షించాల్సింది పోయి, మీ సౌలభ్యం కోసం విమర్శలు చేయడం సరికాదని టీపీసీసీ చీఫ్ అన్నారు.

Advertisement

Next Story