ఫోన్ ట్యాపింగ్ కేసు బెయిల్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్

by M.Rajitha |   ( Updated:2024-10-24 11:32:33.0  )
ఫోన్ ట్యాపింగ్ కేసు బెయిల్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు పోలీసులు ఉన్నతాధికారులు పట్టుబడటం.. వారి వెనుకున్న ప్రముఖ రాజకీయ నాయకులు పేర్లు బయటికి రావడం తీవ్ర దుమారాన్ని రేకెత్తించింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సీనియర్ పోలీస్ అధికారి తిరుపతన్న(Tirupathanna) ప్రస్తుతం సుప్రీంకోర్ట్(Supreme Court) మెట్లు ఎక్కారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోగా.. కేసు విచారణ కీలక దశలో ఉండగా, బెయిల్ ఇవ్వలేమని తిరుపతన్న బెయిల్ పిటిషన్ కొట్టివేసింది కోర్ట్. హైకోర్ట్ ఆర్డర్స్ ను సవాలు చేస్తూ తిరుపతన్న సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. నేడు సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. బెయిల్ ఇవ్వకపోవడానికి గల కారణాలు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed