Congress: యూపీ బైపోల్స్‌లో పోటీచేయబోము.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం

by vinod kumar |
Congress: యూపీ బైపోల్స్‌లో పోటీచేయబోము.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించింది. ఈ ఎలక్షన్స్‌లో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)కి మద్దతు ఇస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి అవినాష్ పాండే గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. బైపోల్స్ జరగనున్న తొమ్మిది స్థానాల్లో ఎస్పీకి మద్దతు ఇవ్వనున్నట్టు తెలిపారు. బీజేపీ, ఎన్డీయేలను ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్ నేతలెవరూ ఎస్పీ గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేయబోరని స్పష్టం చేశారు. ఇండియా కూటమి అభ్యర్థులందరూ ఐక్యంగానే ఉంటారని చెప్పారు. అయితే 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ బరిలో నిలుస్తుందన్నారు. బీజేపీ గత పదేళ్లుగా రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికే ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో యూపీ ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పారన్నారు. కాగా, రాష్ట్రంలోని 9 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 13న ఉపఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed