Ncp sp: ఎన్సీపీ (ఎస్పీ) తొలి జాబితా రిలీజ్.. బారామతి నుంచి బరిలోకి కీలక నేత

by vinod kumar |
Ncp sp: ఎన్సీపీ (ఎస్పీ) తొలి జాబితా రిలీజ్.. బారామతి నుంచి బరిలోకి కీలక నేత
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గాను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్ వర్గం (ఎన్సీపీ ఎస్పీ) తన తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్న 45 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ లిస్టులో పలువురు కీలక నేతలకు అవకాశం దక్కింది. రాష్ట్ర పార్టీ చీఫ్ జయంత్ పాటిల్ ఇస్లాంపూర్ నుంచి బరిలోకి దిగనుండగా.. ముంబ్రా-కాల్వా నియోజవర్గం నుంచి జితేంద్ర అవద్, కటోల్ నుంచి అనిల్ దేశ్ ముఖ్, ఇందాపూర్ సెగ్మెంట్‌లో హర్షవర్ధన్ పాటిల్‌లు పోటీ చేయనున్నారు. అలాగే ఆర్ ఆర్ పాటిల్ కుమారుడు రోహిత్ పాటిల్‌కు తాస్గావ్-కవ్తేమహంకల్ స్థానం నుంచి టికెట్ దక్కింది.

బారామతి నుంచి యుగేంద్ర పవార్‌

మహారాష్ట డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ బరిలోకి దిగుతున్న బారామతి నియోజకవర్గం నుంచి యుగేంద్ర పవార్‌ను ఎన్సీపీ(ఎస్పీ) బరిలోకి దింపింది. యుగేంద్రకు అజిత్ వరుసకు మామ కావడం గమనార్హం. దీంతో బారామతి నియోజకవర్గంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవల బీజేపీని వీడి ఎన్సీపీ(ఎస్పీ)లో చేరిన హర్షవర్ధన్ పాటిల్‌కు ఇందాపూర్ నుంచి అవకాశం కల్పించింది. కాగా, రాష్ట్రంలోని మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో ఎన్సీపీ(ఎస్పీ) భాగస్వామిగా ఉంది. అయితే ఈ కూటమిలో సీట్ షేరింగ్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. అయినప్పటికీ అలయెన్స్‌లో ఉన్న కాంగ్రెస్, శివసేన(యూబీటీ)లు సైతం అభ్యర్థులను ప్రకటించాయి.

Advertisement

Next Story

Most Viewed