తమిళనాడులో రచ్చకెక్కిన దేవాదాయశాఖ vs దీక్షితుల వర్గం పంచాయితీ

by M.Rajitha |
తమిళనాడులో రచ్చకెక్కిన దేవాదాయశాఖ vs దీక్షితుల వర్గం పంచాయితీ
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోనే ప్రముఖ దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన తమిళనాడులో వింత పరిస్థితి నెలకొంది. తమిళనాడు దేవాదాయశాఖకు దీక్షితుల వర్గానికి మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన చిదంబర నటరాజస్వామి ఆలయ సంపద విషయంలో ఇరు వర్గాలకు వివాదం మొదలైంది. ఆలయానికి సంబంధించిన కోట్ల విలువైన భూములను దీక్షితుల వర్గం తెగనమ్ముకున్నారని దేవాదాయశాఖ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు దీక్షితుల వర్గం తీవ్రంగా ఖండించినప్పటికీ.. పంచాయితీ అక్కడితో ఆగిపోలేదు. దీక్షితుల వర్గం అమ్ముకున్న ఆలయ భూముల పూర్తి వివరాలతో తమిళనాడు హైకోర్టులో కేసు వేసింది దేవాదాయశాఖ. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం దీక్షితుల వర్గానికి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను నవంబర్ 14కి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed