China : మోడీ - జిన్‌పింగ్ భేటీ‌పై చైనా కీలక ప్రకటన

by Hajipasha |
China : మోడీ - జిన్‌పింగ్ భేటీ‌పై చైనా కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘బ్రిక్స్’ సదస్సు వేళ భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమావేశంపై చైనా గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్యలు చేపట్టాలనే అంశంపై ఇరుదేశాలు ఉమ్మడి అవగాహనకు రావడాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన పరిణామంగా చైనా అభివర్ణించింది. ‘‘భారత్‌తో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధం. దీర్ఘకాలిక వ్యూహం, వ్యూహాత్మక లక్ష్యాలతో ఇరుదేశాలు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని మేం ఆశిస్తున్నాం’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లీ జియాన్ వెల్లడించారు.

‘‘ ఇరుదేశాల మధ్య ఉమ్మడి విశ్వాసాన్ని పెంచేందుకు, అపోహలను దూరం చేసేందుకు చైనా తరఫు నుంచి భారత్‌కు తప్పకుండా సహకరిస్తాం. భారత్‌కు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని, సహకారాన్ని అందిస్తాం’’ అని ఆయన తెలిపారు. ఇరుదేశాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధుల ద్వారా సరిహద్దు వివాదానికి పూర్తిస్థాయి పరిష్కారాన్ని కనుగొంటామన్నారు. భారత్, చైనాల ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని లీ జియాన్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed