- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూగుల్ మ్యాప్ వేతో వెళ్లి... అడవిలో చిక్కి
దిశ, మల్హర్: గూగుల్ మ్యాప్ వే ప్రయాణం ప్రాణ సంకటనలో పడేసింది. ఒకరు అటవిలో చిక్కుకుని ప్రాణభయంతో వందకు డయల్ చేయడంతో పోలీసులు రక్షించిన సంఘటన మల్హర్ మండలంలో బుధవారం రాత్రి జరిగింది. ఆలస్యంగా తెలిసిన సమాచారం కొయ్యూరు ఎస్సై కథనం మేరకు ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన జస్వ అనే వ్యక్తి గూగుల్ వే మ్యాప్ ద్వారా మంచిర్యాల నుంచి ఖమ్మం జిల్లాకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. పెద్దపల్లి జిల్లా మంథని, ఖమ్మం పల్లి మానేరు బ్రిడ్జి నుంచి మండలంలోని తాడిచర్ల, కిషన్ రావు పల్లి భూపాలపల్లి రూట్ మ్యాప్ చూపించడంతో జస్వ ఆ రూట్ మ్యాప్ ద్వారా రవాణా కొనసాగించి అర్ధరాత్రి కిషన్రావుపల్లి ఫారెస్ట్ లో తప్పిపోయాడు.
వందకు డయల్ చేయడంతో కొయ్యూరు ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ద్వారా అదే రాత్రి రెండు గంటలు శ్రమించి అటవీని జల్లెడ పట్టి తప్పిపోయిన వ్యక్తిని రక్షించినట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా అటవీ దారి తప్పిపోవడం ద్విచక్ర వాహనం చెడిపోవడం వల్ల జస్వ అటవీలో భయభ్రాంతులకు గురయ్యాడు. దీంతో వందకు డయల్ చేయగా తమ సిబ్బంది అప్రమత్తమై గ్రామస్తుల సహకారంతో ట్రాక్టర్ ద్వారా ద్విచక్ర వాహనాన్ని తరలించి సురక్షితంగా గురువారం ఖమ్మం పంపించినట్లు ఎస్సై పేర్కొన్నారు. గూగుల్ వే రూట్ మ్యాప్ కొంత బేష్ ఐన మరికొంత కష్టంగా ఉంటుంది. ఇప్పటికైనా గ్రహించండి మీ ప్రయాణాన్ని సురక్షితంగా చేరుకునేలా జాగ్రత్తలు పాటించాలని ఎస్సై సూచించారు.