Sai Pallavi: కీలక నిర్ణయం తీసుకున్న సాయిపల్లవి.. అప్పుడే డిసైడ్ అయ్యానంటూ ఎమోషనల్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-10-24 15:46:55.0  )
Sai Pallavi: కీలక నిర్ణయం తీసుకున్న సాయిపల్లవి.. అప్పుడే డిసైడ్ అయ్యానంటూ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి మూవీతోనే సూపర్ హిట్ సాధించిన ఆమె నాగచైతన్యతో ‘లవ్‌స్టోరీ’(Love Story) సినిమాలో నటించింది. ఇది కూడా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. తెలుగు, మలయాళంలో సినిమాలు చేసి నేచురల్ బ్యూటీగా యూత్ కలల రాణిగా మారిపోయింది. రెండేళ్ల తర్వాత ‘అమరన్’(Amaran) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న సాయి పల్లవి(Sai Pallavi) తాను పొట్టి డ్రెస్సులు వేసుకోకపోవడానికి కారణం ఏంటో రివీల్ చేసింది. ‘‘నేను ఎంబీబీఎస్ చదువుకోవడానికి జార్జియాకు వెళ్లాను. అయితే ఉన్న ఆసక్తితో.. టాంగో డాన్స్(Tango Dance) నేర్చుకున్నాను. అప్పుడే డాన్స్ వేయడానికి పొట్టి డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నాకు తెలుసు.. డాన్స్ కోసం ఫర్వాలేదులే అనుకున్నా. కానీ నా మొదటి సినిమా విడుదలైన తర్వాత కొంతమంది ఆ పాత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి దారుణంగా కామెంట్లు చేశారు.

ఆ నెగిటివ్ కామెంట్స్ చూసి నాకు చాలా బాధ కలిగింది. అందుకే ఎప్పటికీ పొట్టి డ్రెస్‌లు వేసుకోవద్దని నిర్ణయించుకున్నాను. డ్రెస్‌ల విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కొన్ని రోజుల తర్వాత కండీషన్‌గా మారింది. దాన్ని తప్పనిసరిగా పాటించాలని అనుకున్నా. దాని వల్ల కొద్ది కాలంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అనిపిస్తుంది. కానీ నా కెరీర్ విషయంలో పూర్తి క్లారిటీ ఉంది. నాలో ప్రతిభ మీద ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఆఫర్లు వస్తాయనే నమ్మకం ఉంది’’ అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed