Saroornagar Apsara Murder : సాయి కృష్ణ కస్టడీకి పిటిషన్

by Anjali |   ( Updated:2023-06-12 08:05:27.0  )
Saroornagar Apsara Murder : సాయి కృష్ణ కస్టడీకి పిటిషన్
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: సంచలనం సృష్టించినSaroornagar Apsara Murder : వారం రోజులపాటు కస్టడీకి అనుమతించాలని శంషాబాద్ పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసారు. ఈ కేసుకు సంబంధించి సాయి కృష్ణ నుంచి మరిన్ని వివరాలు సేకరింంచాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. అప్సర మృతదేహాన్ని మ్యాన్ హోల్ లో వేసిన తర్వాత సాయి కృష్ణ దానిపై రెండు బస్తాల దొడ్డు ఉప్పు, రెండు ట్రాక్టర్ల ఎర్ర మట్టి పోసిన విషయం తెలిసిందే. వీటిని ఎక్కడ నుంచి కొన్నాడు? అన్నది తెలుసుకోవాల్సి ఉందని పోలీసులు పిటిషన్ లో పేర్కొన్నారు. దాంతోపాటు క్రైం సీన్ రీ కన్స్ట్రక్ట్ చెయ్యాల్సి ఉందని తెలిపారు. ఈ పిటిషన్‌పై కోర్టు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.

Also Read: Apsara Murder Case : పోలీసుల విచారణలో షాకింగ్ ట్విస్ట్

Advertisement

Next Story