‘జూనియర్, డిగ్రీ కళాశాలల్లో నూతన లెక్చరర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి’

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-16 14:01:46.0  )
‘జూనియర్, డిగ్రీ కళాశాలల్లో నూతన లెక్చరర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి’
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలోని 'ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న నూతన అధ్యాపకులకు పెండింగ్‌లో ఉన్న మే నెల వేతనాలను వెంటనే చెల్లించాలని సోమవారం ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఆన్‌లైన్‌లో ద్వారా వినతి పత్రం పంపించినట్లు, తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోప్పిశెట్టి సురేష్ తెలిపారు.

ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను మే నెలలో క్రమబద్ధీకరించడం జరిగిందన్నారు. ఈ క్రమబద్దీకరణ జరిగిన నూతన అధ్యాపకులకు మే నెల వేతనాలు ఇంతవరకు అందలేదని తెలిపారు. సుమారు 2000 మంది పైగా టోకెన్ నెంబర్లు వచ్చి ఈ కుబేరులు పెండింగ్ చూపిస్తున్నాయని తెలిపారు. వెంటనే ఆర్థిక శాఖ కార్యదర్శి జోక్యం చేసుకొని ఈ కుబేరులు పెండింగ్‌లో ఉన్న నూతన అధ్యాపకుల మే నెల వేతనాలు వెంటనే చెల్లించవలసిందిగా విన్నవించడం జరిగిందని వారు తెలిపారు.

Advertisement

Next Story