- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PDSU రాష్ట్ర మహాసభల ఎజెండా ఇదే!
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర 22వ మహాసభలు ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లోని జరగనున్నాయని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్ పల్లి రాము సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఈ నెల 7వ తేదీన జరగబోయే బహిరంగ సభకు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, విద్యావేత్త, హక్కుల ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ హరగోపాల్, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, నగర కార్యదర్శి ఎం హన్మేష్, పీడీఎస్‌యూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎల్. పద్మ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్‌పల్లి రాము, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎస్.అనిల్ ప్రసంగిస్తారని వెల్లడించారు. ఈ నెల 8వ వీఎస్‌టీ, బాగ్‌లింగంపల్లిలో జరిగే ప్రతినిధుల సభలో హేతువాద సంఘం జాతీయ కార్యదర్శి(కర్ణాటక) నరేంద్ర నాయక్ పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు. విద్యారంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై, సమాజంలో రోజురోజుకు తీవ్రమవుతున్న అసమానతలపై పోరాటాలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. మత సామరస్యానికి, లౌకిక తత్వానికి, మానవత్వానికి నిలయమైన హైదరాబాద్‌లో ఉండే విద్యా శ్రేయోభిలాషులు మహాసభల సందర్భంగా జరిగే ర్యాలీ, బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.