- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pawan Kalyan: చట్టం ఎవరికీ చుట్టం కాదు.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: చట్టం ఎవరికీ చుట్టం కాదని.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారని కామెంట్ చేశారు. రేవతి (Revathi) మృతి చెందిన తరువాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలని, అక్కడే మానవతా దృక్పథం లోపించినట్లైందని అన్నారు. హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కాకపోయినా.. కనీసం మూవీ టీమ్ అయినా బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉండాల్సిందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పేరు చెప్పలేదని అల్లు అర్జున్ (Allu Arjun)ను అరెస్ట్ చేశారని అనడం సరికాదని అన్నారు.
కానీ, రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బన్నీ స్థానంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఉన్నా.. అలాగే అరెస్ట్ చేస్తారని, చట్టం ఎవరికీ చుట్టం కాదని అన్నారు. సీనీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ కృషి చేశారని, పుష్ప-2 బెనిఫిట్ షో (Benefit Shows)లకు టికెట్ రేట్లు పెంచడం పరిశ్రమనను ప్రోత్సహించడమేనని అన్నారు. సంథ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట (Stampede) ఘటనలో అల్లు అర్జున్ (Allu Arjun)ను ఒంటరిని చేశారని, అతడి విషయంలో ముందు, వెనుక ఏం జరిగిందో తెలియదని కామెంట్ చేశారు. అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకు ఉంటుందని.. ఇందులో పోలీసుల తీరును తాను తప్పబట్టబోనని పవన్ కళ్యాణ్ అన్నారు.
Read More : నాగబాబు పదవిపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు