Cobra Forces :రెండు ప్రెజర్ ఐఈడీలను పేల్చివేసిన కోబ్రా బలగాలు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-02 06:16:59.0  )
Cobra Forces :రెండు ప్రెజర్ ఐఈడీలను పేల్చివేసిన కోబ్రా బలగాలు
X

దిశ, వెబ్ డెస్క్ : మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ కగార్ కోసం చత్తీస్ గఢ్ అడవుల్లో కూంబింగ్స్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలను నిలువరించేందుకు మావోయిస్టులు సైతం తమదైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. భద్రత బలగాలు..మావోయిస్టుల పరస్పర దాడుల వ్యూహాలను కనిపెట్టి తిప్పికొట్టడంలో రెండు వర్గాలు హోరాహోరిగా ప్రయత్నిస్తునే ఉన్నాయి. తమ వేట కోసం వచ్చే భద్రత బలగాలను మట్టుపెట్టే లక్ష్యంతో అడవుల్లో మావోయిస్టు(Maoists)లు అమర్చిన రెండు మందుపాతరాల(IED Bombs)ను కోబ్రా పోలీస్ బలగాలు(Cobra Forces) ముందే పసిగట్టి పెను ముప్పు నుంచి తప్పించుకున్నాయి. చత్తీస్ గఢ్(Chhattisgarh)చాట్రాయి కొండపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు లక్ష్యంగా 3 కిలోల చొప్పున రెండు ఐఈడీ బాంబులను పాతిపెట్టారు. సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా వాటిని గుర్తించిన కోబ్రా స్పెషల్ పోలీస్ సిబ్బంది బాంబులను నిర్వీర్యం చేసి సురక్షితంగా పేల్చివేశారు.

చత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ లో ఏడాది కాలంలో ఇప్పటికే 250మంది దాక మావోయిస్టులు హతమయ్యారు. 2026 మార్చి 31నాటికి మావోయిస్టు ముక్త్ భారత్ అంటూ కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టే దిశగా భద్రత బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed