దారుణం.. కర్రతో కొట్టి తాడుతో ఉరివేసి భర్తను చంపిన భార్య

by srinivas |   ( Updated:2025-01-02 11:45:25.0  )
దారుణం.. కర్రతో కొట్టి తాడుతో ఉరివేసి భర్తను చంపిన భార్య
X

దిశ, వెబ్ డెస్క్: నడిరోడ్డుపై భర్తను భార్య చంపిన ఘటన బాపట్ల జిల్లా(Bapatla District)లో జరిగింది. అమరేందర్ కుటుంబం కొంతకాలంగా నిజాంపట్నం మండలం కొత్త పాలెం(Kottapalam)లో ఉంటోంది. అయితే ఎమైందో ఏమో గాని వీళ్లిద్దరూ ఒక్కసారిగా నడిరోడ్డుపైకి వచ్చి ఘర్షణకు దిగారు. మాటామాటా పెరిగి పరస్పరం కొట్టుకున్నారు. విచక్షణ కోల్పోయిన భార్య.. భర్త తలపై కర్రతో కొట్టారు. దీంతో అమరేందర్ కిందపడిపోయారు. వెంటనే అమరేందర్ గొంతుకు తాడుతో ఉరేసింది. దీంతో భర్త అమరేందర్ అక్కడిక్కక్కడే మృతి చెందారు. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భార్యను అరెస్ట్ చేశారు. అమరేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అయితే నిత్యం మద్యం తాగి వచ్చి భార్య అరుణతో గొడవపడుతున్నారని, ఈ క్రమంలోనే ఇవాళ కూడా మరోసారి ఘర్షణ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More : ఏపీలో ఘోరం.. వదినను చంపి మృతదేహంపై అత్యాచారం

Advertisement

Next Story

Most Viewed