Passport Services: దేశవ్యాప్తంగా 3 రోజులపాటు పాస్ పోర్టు సేవలు బంద్

by Ramesh Goud |   ( Updated:2024-08-28 13:21:12.0  )
Passport Services: దేశవ్యాప్తంగా 3 రోజులపాటు పాస్ పోర్టు సేవలు బంద్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో మూడు రోజులపాటు పాస్ పోర్ట్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు పాస్ పోర్ట్ సేవా సమితి ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గురువారం రాత్రి రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పాస్ పోర్ట్ సర్వీసులు పనిచేయవు. సాఫ్ట్వేర్ మెయిన్ టెనెన్స్ కోసం మూడు రోజుల పాటు పాస్ పోర్ట్ సేవలను నిలిపివేస్తున్నట్లు పాస్ పోర్ట్ సేవా సమితి పేర్కొంది. పాస్ పోర్ట్ సంబంధిత సర్వీసులను మరింత మెరుగు పరిచేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆయా తేదీల్లో ఉన్న అపాయింట్మెంట్స్ ను ఇతర తేదీలకు సర్దుబాటు చేస్తామని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed