Phone Tapping Case: ప్రభాకర్ రావు, శ్రవణ్ కు బిగ్ షాక్.. ఇంటర్ పోల్ కు సీబీఐ నివేదిక

by Rani Yarlagadda |
Phone Tapping Case: ప్రభాకర్ రావు, శ్రవణ్ కు బిగ్ షాక్.. ఇంటర్ పోల్ కు సీబీఐ నివేదిక
X

దిశ, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో కీలక నిందితులుగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న వీరిద్దరి పాస్ పోర్టులను పాస్ పోర్ట్ ఆఫీస్(Passport Office) రద్దు చేసింది. కొన్నాళ్లుగా వీరిద్దరూ పరారీలో ఉండగా.. వారి పాస్ పోర్టుల్ని రద్దు చేయాలని పాస్ పోర్టు ఆఫీసుకు పోలీసులు లేఖ రాశారు. పోలీసుల నివేదికను పరిశీలించిన అధికారులు వారి పాస్ పోర్టులను రద్దు చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) అమెరికా పోలీసుల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిపైనా లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సీబీఐ (CBI) ఇంటర్ పోల్ (Interpol) కు నివేదిక పంపింది.

Advertisement

Next Story

Most Viewed