పార్టీ మార్పు ప్రచారం.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి క్లారిటీ

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-22 06:05:43.0  )
పార్టీ మార్పు ప్రచారం.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : గత కొంత కాలంగా తెలంగాణ బీజేపీలో పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. పార్టీలో అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాము కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలు ఫేక్ అని కొట్టిపారేశారు. ఇదంతా కేసీఆర్ పన్నాగం అని చివరకు ఆయన ప్రచారం ఈ స్థాయికి చేరుకుందని ధ్వజమెత్తారు. కేసీఆర్ బరితెగించారని ధ్వజమెత్తారు.

తమ విషయంలో అధికార పార్టీ లేనిపోని ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. కాగా లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లడం ఖాయం అని అందరూ అనుకుంటున్నారని కానీ కవిత అరెస్ట్ కాకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఏదో అవగాహన ఒప్పందని ఉందని ప్రజల్లోకి తప్పుకు సంకేతాలు వెళ్తున్నాయని ఇటీవల కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను అరెస్టు చేయలేకపోవడం వల్లే తెలంగాణలో బీజేపీ దూకుడుకు బ్రేకులు పడ్డాయని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో ఆయన బీజేపీని వీడబోతున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి. దీంతో ఈ ప్రచారంపై స్పందిస్తూ అదంతా అబద్ధమని కొట్టిపారేశారు.

Read More... ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్! ‘ఇంటింటికి బీజేపీ’‌కి ఇద్దరు కీలక నేతలు దూరం

Advertisement

Next Story

Most Viewed