హరీష్ రావుకు ఇస్తేనే ప్రతిపక్షంగా భావిస్తారా?.. అరికెపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
హరీష్ రావుకు ఇస్తేనే ప్రతిపక్షంగా భావిస్తారా?.. అరికెపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్/శేరిలింగంపల్లి: పీఏసీ చైర్మన్ అరికేపూడి గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నాను తనకు పీఏసీ పదవి ఇచ్చారని గాంధీ అన్నారు. తనపై విమర్శలు చేసే వారికి ఇదే నా సవాల్.. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఎలాంటి పరిణామాలకైనా తాను సిద్ధమని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్లు ఏం చేశారో గుర్తుతెచ్చుకోవాలని హితవు పలికారు.

సీఎం రేవంత్‌ను కలిసినప్పుడు తాను కాంగ్రెస్‌ కండువా కప్పుకోలేదని అన్నారు. ఆలయానికి సంబంధించిన శాలువానే తనకూ కప్పారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచాను.. అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తాను అని అన్నారు. కాగా, తాను గాంధీ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారని వార్తలు వినిపించాయి. ఆయనకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గాంధీ స్పందించారు. హరీష్ రావుకు ఇస్తేనే ప్రతిపక్షంగా భావిస్తారా.. వేరే వాళ్లకు ఇస్తే ఒప్పుకోరా అని గాంధీ సూటిగా ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed