- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్తతో విడాకులు.. ఆ స్టార్ హీరోతో పెళ్లి, న్యూయార్క్‌లో హనీమూన్.. ఎట్టకేలకు మౌనం వీడిన Aishwarya Rai
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్(Aishwarya Rai) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరికి ఆరాధ్య(Aaradhya) అనే పాప కూడా ఉంది. అయితే ఈ జంట కొన్ని రోజుల నుంచి విడాకులు(Divorce) తీసుకుంటున్నారనే పుకార్లు నెట్టింట షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించలేదు. కానీ ఐష్ ఎక్కడికి వెళ్లిన తన కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్తుంది. కానీ అభిషేక్ బచ్చన్ మాత్రం కనిపిస్తలేదు. దీంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
గతంలో ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్(Salman Khan) ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే వార్తలు బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా వీరిద్దరు లోనావానాలోని ఒక బంగ్లాలో పెళ్లి చేసుకున్నట్లు, సల్మాన్‌ను మ్యారేజ్ చేసుకునేందుకు ఐష్ మతం కూడా మార్చుకున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత హనీమూన్ కోసం న్యూయార్క్ వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని వీరిద్దరూ ధృవీకరించలేదు. అయినప్పటికీ ఈ వార్తలకు బ్రేక్ పడలేదు. ఇలా సల్మాన్‌తో పెళ్లి, హనీమూన్ పై వస్తున్న వార్తలపై ఐశ్వర్యరాయ్ స్పందించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐష్‌ను.. గతంలో మీరు సల్మాన్ ఖాన్‌తో సీక్రేట్‌గా పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం న్యూయార్క్ వెళ్లారని వస్తున్న వార్తలు నిజమేనా అని యాంకర్ అడుగగా.. దానికి ఐశ్వర్యరాయ్ స్పందిస్తూ.. “నేను సల్మాన్ ఖాన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చింది. మద్యం సేవించి సల్మాన్ అనుచితంగా ప్రవర్తించేవాడు. ఇది నా జీవితంలోని చెత్త దశగా నేను భావిస్తాను. అతను నన్ను శారీరకంగా, మానసికంగా వేధించాడు. దీంతో అప్పుడే నేను అతనితో విడిపోయాను. ఇప్పుడు పెళ్లి, హనీమూన్ వంటి విషయాలపై వస్తున్న పుకార్లు పూర్తిగా అవాస్తవం. ఇందులో ఎలాంటి నిజం లేదు” అని వాటిని కొట్టిపారేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
భర్తతో విడాకులు.. వారితో ఎంజాయ్ చేస్తున్న ఐశ్వర్య రాయ్.. ఫొటోలు వైరల్..